ఇద్దరునేతల రాకతో బిజెపి మరింతశక్తివంతం!

bjpFFf
B J P

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపరంగా భారతీయజనతాపార్టీ 2013 నాటి కాంగ్రెస్‌పార్టీ విజయావకాశాలకు గండికొట్టగలమని ధీమా వ్యక్తంచేస్తోంది. 2013నాటి ఎన్నికలతోపోలిస్తే ఇప్పటి ఎన్నికల వాతావరణంవేరని బిజెపికి విజయావకాశాలు భారీగా ఉన్నట్లు ఆపార్టీ నమ్ముతోంది. బిఎస్‌యెడ్యూరప్ప, బి.శ్రీరాములు వంటివారు తిరిగి పార్టీలోనికి రావడంతో పార్టీకి మరింత దన్ను పెరిగిందని చెపుతోంది. ఈ ఇద్దరునేతలే రాష్ట్రంలో అత్యంతశక్తివంతమైన నాయకులుగా చెలామణి అవుతున్నసంగతి తెలిసిందే. ఇక ఓటర్ల గణాంకాలు సర్వేలనుచూస్తే ఇప్టపివరకూ భారతీయ జనతాపార్టీకి అనుకూలంగా ఉందని నేతలు హర్షంప్రకటిఉ్తన్నారు. రెండు ఎన్నికలు భిన్నసారూప్యతతోనడిచాయి. బిఎస్‌యెడ్యూరప్ప, శ్రీరాములు వంటిశక్తివంతమైననేతలు పార్టీలోనికి తిరిగి రావడంతో బిజెపికి మంచి లాభం చేకూరిందని, వారి పునరాగమనంతో బిజెపని లోక్‌సభ ఎన్నికల్లో లాభం పొందిందని అన్నారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, మాజీ రాష్ట్ర మంత్రి శ్రీరాములు బిజెపిలో 2014లోనేమళ్లీ వచ్చిచేరారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో సైతం వారు కాషాయం అభ్యర్ధులుగా పోటీలో ఉన్నారు. యెడ్యూరప్ప నాయకత్వం వహించిన కర్నాటక జనతాపక్ష(కెజెపి) శ్రీరాములు ఆధ్వర్యంలో బదవర శ్రామికర రైతారా కాంగ్రెస్‌(బిఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌)లు వేరుకుంపట్ల కారణంగా 2013 ఎన్నికలు కాంగ్రెస్‌పార్టీకి పగ్గాలు ఇచ్చినట్లయిందని బిజెపి నేతలు చెపుతున్నారు. ఇపుడు వీరిద్దరూ కూడా పార్లమెంటుసభ్యులుగా కొనసాగుతున్నారు. ఇక ఎన్నికల గణాంకాలను చూస్తే 2013లో సీట్ల వారీగా విశ్లేషణచేస్తే బిజెపికి సానుకూలంగా ఉన్నాయి. ఈ ఇద్దరు నాయకులు బిజెపిని 2012లో వీడివెళ్లారు. దీనివల్ల కాషాయం పార్టీకి తీరని విఘాతం కలిగింది. అంతేకాకుండా కాషాయం పార్టీని అధికారపీఠంనుంచి దించేసింది. 224 మంది సభ్యులున్న కర్నాటకలో కేవలం 40 సీట్లు మాత్రమే బిజెపి గెలుచుకోగలిగింది. బిజెపి కనీసం 68 స్థానాలు గెలుచుకోవాల్సి ఉందని, కెజిపి గెలిచిన ఓట్లను సైతం సాధించాల్సి ఉండేదని అన్నారు. కర్నాటక జనతపక్ష ఆరుస్థానాలు గెలిచింది. వీటినికూడా కలిపితే బిజెపితుది అవకాశాలు 74వరకూ ఉండేవి. దీనితో అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోనికి రాకుండా అడ్డుకోగలిగేది. కాంగ్రెస్‌ పార్టీకి ఆ ఎన్నికల్లో 122నుంచి 100 సీట్లకు తగ్గించేందని అంచనా. ఇకబిఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఓట్లుసైతం బిజెపికి పడి ఉంటే బిజెపి సీట్ల సంఖ్య 80కిపెరిగేది. అప్పట్లో బిఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌నాలుగుస్థానాలు గెలుచుకుంది. ఈ ఇద్దరు నాయకులవల్లనే బిజెపి కర్నాటకలో గత ఎన్నికల్లో ఓటమి పాలయిందని కర్నాటక వర్సిటీ రాజకీయ శాస్త్రం ఆచార్యులు హరీష్‌ రామస్వామి పేర్కొన్నారు. ఇక 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చూస్తే బిజెపి 133 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓట్లు రాబట్టింది. కాంగ్రెస్‌ పార్టీకి 76కుపైగా స్థానాల్లో మంచి ఓట్లు వచ్చాయి. జనతాదళ్‌ సెక్యులర్‌పార్టీకి 15స్థానాల్లో ఆధిక్యం లభించింది. కర్నాటక ఇప్పటికీ త్రిముఖపోటీలో ఉంది. 2013, 2014 ఎన్నికల్లో ఇదే ప్రస్ఫుటం అయింది. అయితే బిజెపికి వీరిద్దరి రాకతోనే విజయావకాశాలు ఖరారయ్యాయని భావించడంలేదు. సిద్దరామయ్యపై వ్యతిరేకప్రచారంలో కొంత బిజెపి వెనుకబడింది. అనేక పాలనాపరమైన అంశాల్లో బిజెపి కాంగ్రెస్‌ ధాటికి అడ్డుకట్ట వేయలేకపోయింది. 2014నాటి ప్రకాశించేస్థాయిలో బిజెపి లేదని కర్నాటక వర్సీటీ రామస్వామి వెల్లడించారు. కర్నాటకలో శక్తివంతమైన లింగాయత్‌ ఓటుబ్యాంకు ఎటువైపు ఉంటుందన్నది ఇప్పటికీ నిర్ధారణ కాలేదు. కాంగ్రెస్‌పార్టీ ఆ ఓటుబ్యాంకుపైనే గురిపెట్టి లింగాయత్‌లను ప్రత్యేక హోదా కేటాయించాలనిప్రతిపాదించింది. కేంద్రహోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీయే లింగాయత్‌లకు మైనార్టీ హోదా కల్పించేందుకు ఐదేళ్లక్రితం నిరాకరించిందని, దీనివల్ల సమాజంరెండుగా చీలుతుందని అప్పట్లో వాదించిందని గుర్తుచేసారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం 2013లోనే ఈప్రతిపాదనను వ్యతిరేకించిందని, సమాజాన్నిచీల్చే ఈ విధానాన్ని తాము అంగీకరించబోమని రాజ్‌నాధ్‌సింగ్‌వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రనేతలకు స్పష్టమైన మార్గనిర్దేశనంచేసారని, ఎవరికివారు కాకుండా అంతాఐక్యంగా ఉండాలని సూచించారని ఏమాత్రం దెబ్బతిన్నా పార్టీకి నష్టం కలుగుతుందని, అలాంటివి ఉపేక్షించబోమనిఒక సీనియర్‌నేత వెల్లడించారు.  గత ఎన్నికలపరంగాచూస్తే కాంగ్రెస్‌ 15 మిలియన్ల ఓట్లు సాధిస్తే బిఎపని 6.24 మిలియన్ల ఓట్లు సాధించింది. కెజెపి 3.07 మిలియన్లఓట్లు, బిఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 8.45 లక్షలకోట్లు 2013 ఎన్నికల్లో రాబట్టాయి. కెజెపి పరంగా ఆరుసీట్లు గెలుచుకుంది. 35మంది ఇతరుల స్థానాలకంటేమెరుగ్గా నిలిచింది. బిఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాలుగుస్థానాలుఏ, మరోమూడుస్థానాల్లో రన్నర్‌అప్‌గా నిలిచింది. బిజెపని సంఖ్యాపరంగా 68కి పెరిగింది. చివరకు కెజెపి ఓట్లు కూడా రాబట్టగలిగితే అప్పట్లో మరో 40స్థానాలు గెలుచుకునేదని అంచనా. ఈరెండూ కలిపితే బిజెపికి 74స్థానాలకుపైగా వచ్చి ఉండేవి. బిజెపి కనీసం 80స్థానాలు గెలుచుకుని ఉండాలి. బిఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు సైతం బిజెపి కిట్టీలోనికి వస్తే సీట్లసంఖ్య పెరిగేది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగాచూస్తే 2014 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి 133 స్థానాల్లో ఆధిక్యం కనబరిచింది. కాంగ్రెస్‌ పార్టీపరంగా 76, జెడిఎస్‌పరంగా 15 స్థానాల్లో ఆధిక్యతను కనబరిచింది.