ఇండిగో ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించాం..

P.Ashok GajapatiRaju
P.Ashok GajapatiRaju

ఢిల్లీః ఇండిగో సంస్థ సిబ్బంది ప్రవర్తనను కేంద్ర పౌరవిమానయాణ శాఖ మంత్రి అశోక్‌గజపతి  తీవ్రంగా ఖండించారు. ఈ ఘ‌ట‌న‌పై సమగ్ర విచారణకు ఆదేశించామని, ఇప్పటికే ఇండిగో సంస్థకు సమన్లు జారీ చేశామని తెలిపారు. డీజీసీఏ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని స్ప‌ష్టం చేశారు. ప్రయాణీకులు ఫిర్యాదులు చేయడానికి ఎయిర్ సేవా యాప్‌ను ఉపయోగించుకోవాలని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.