ఆ గుడిలో నాకు చోటు లేదు

Shashi Tharoor
Shashi Tharoor

మున్నార్‌: కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ పని నిమిత్తం సోమవారం కేరళ వెళ్లారు. మున్నార్‌ ప్రాంతంలోని హోటల్‌లో బస చేసేందుకు ఓ గదిని తీసుకున్నారు. అయితే ఈ గదిని బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌ చెన్నై ఎక్స్‌ ప్రెస్‌ సినిమాలో నటిస్తున్నప్పుడు బుక్‌ చేసుకున్న గది అది. దీంతో ఆ గదిని కాస్తా షారుక్‌ గుడిలా మార్చేశారట. ఈ విషయాన్ని థరూర్‌ ట్విటర్ ద్వారా వెల్లడించారు. డియర్‌ షారుక్‌..  మీరు చెన్నై ఎక్స్‌ప్రెస్‌ చిత్రంలో నటిస్తున్న సమయంలో బుక్‌ చేసుకున్న హోటల్‌ గదినే నేనూ బుక్‌ చేసుకున్నాను. తీరా చూస్తే ఆ గదిని ఓ గుడిగా మార్చేశారు. గోడలన్నీ మీ ఫొటోలతో నిండిపోయాయి. మీ భారీ కటౌట్‌ ఆ గదినే డామినేట్‌ చేస్తోంది. నాకు విశ్రాంతి తీసుకోవడానికి చోటు లేదు అని వెల్లడిస్తూ కటౌట్‌ పక్కన నిలబడి దిగిన ఫొటోలను పోస్ట్‌ చేశారు.