‘ఆర్డినెన్స్‌ ఎలా తెస్తారో మేమూ చూస్తాం..’

ASADUDDIN OWISI
ASADUDDIN OWISI

న్యూఢిల్లీ: అయోధ్య వివాదం అంశంపై విచారణను వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్రం తక్షణమే ఆర్డినెన్స్‌ తేవాలన్న డిమాండ్‌ తెరపైకి వచ్చింది. శివసేన, ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి నుంచి రామమందిర నిర్మాణానికి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసి స్పందించారు. పైన చెప్పిన పార్టీలన్నీ ఇదే మాటను ఎప్పటినుంచో చెబుతున్నాయి. మీరు అధికారంలో ఉన్నారు. ఆర్డినెన్స్‌ ఎలా తెస్తారో మేమూ చూస్తాం అంటూ ఒవైసి హెచ్చరిక చేశారు.