ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక డిసెంబర్‌ 31న

Madras High Court
Madras High Court

చెన్నై: తమిళనాడులో ఆర్కేనగర్‌లో ఉప ఎన్నికను డిసెంబర్‌ 31న నిర్వహించాల్సిందిగా మద్రాస్‌ హైకోర్టు ఎన్నికల కమీషన్‌ను
ఆదేశించింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ఇందికా బెనర్జీ, జస్టిస్‌ ఎం.సుందర్‌ ఆదేశాలు జారీ చేశారు. మాజీ సీఎం జయలలిత
మృతితో ఆర్కే నగర్‌ నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడింది. షెడ్యూల్‌ ప్రకారం ఏఫ్రిల్‌ 12న ఉపఎన్నిక జరగాల్సి ఉండగా ఘర్షణలు
తలెత్తడంతో ఎన్నికను ఈసీ రద్దు చేసింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఇష్టారాజ్యంగా డబ్బులు పంపిణీ జరిగినట్లు ఆరోపణలు
రావడంతో పాటు ఘర్షణలు చెలరేగడంతో ఎన్నికను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో అక్కడి పరిస్థితులు గాడితప్పాయని వెంటనే
ఉప ఎన్నిక నిర్వహించాల్సిందిగా న్యాయస్థానంలో ఓ వ్యక్తి వ్యాజ్యం వేశారు. విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఈసీకు
ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేసి డిసెంబర్‌ 31న ఎన్నిక నిర్వహించాల్సిందిగా న్యాయస్థానం
ఆదేశాలు వెలువరించింది.