ఆరు రాష్ట్రాలకు సుప్రీం జరిమానా

supreem court
supreem court

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలు, పర్యవేక్షణకు అవసరమైన ఆన్‌లైన్‌ లింక్‌ను ఏర్పాటు చేయడంలో విఫలమైన రాష్ట్రాలకు సుప్రీం కోర్టు జరిమానా విధించింది. ఏపితో పాటు మేఘాలయ, ఒడిశా, ఢిల్లీ, అరుణాచల్‌ప్రదేశ్‌, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రాలకు కోర్టు జరిమానా విధించింది. ఢిల్లీకి 2 లక్షల రూపాయల జరిమానా వేయగా, మిగిలిన రాష్ట్రాలకు లక్ష చొప్పున ఫైన్‌ వేసింది. మూడు నెలల్లో వెబ్‌సైట్‌కు ఆన్‌లైన్‌ లింక్‌ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు పాటించకపోవడంతో ఈ మేరకు ఆరు రాష్ట్రాలకు కోర్టు జరిమానా విధించింది.