ఆధార్‌-సిమ్‌ రీ వెరిఫికేషన్‌కు సమయం కావాలి

SIM-AAD
SIM-AAD

న్యూఢిల్లీ: మొబైల్‌ సిమ్‌ల రీ వెరిఫికేషన్‌కు ఒటిపి తరహాలో ఆధార్‌ అధారిత కొత్త విధానం అమల్లోకి రావాలంటే ఇంకాస్త సమయం
అవసరమని సెల్యూలార్‌ ఆపరేటర్స్‌ సంఘం కామ్‌ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థని కోరింది. ప్రస్తుతం డిసెంబరు 1 తుది
గడువుగా ఉంది. తాము ఇంకా సిద్ధంగా లేమని కా§్‌ు తెలిపింది. ఎఐడిఎఐ ప్రతిపాదిత విధానం అమలుకు ఇచ్చిన గడువు
ఆచరణీయంగా లేదని టెలికాం శాఖ, యుఐడిఎఐకి సూచించినట్లు కా§్‌ు డిజి రాజన్‌ మాథ్యూస్‌ మీడియాకు వెల్లడించింది.
వన్‌టైం పాస్‌వర్డులు, ఎస్‌ఎంఎస్‌ ఆధారిత కొత్త విధానం త్వరగా తీసుకురావాలని యుఐడిఎఐ సెల్యూలార్‌ ఆపరేటర్లను
ఆదేశించింది. కస్టమర్‌ ఆక్విజిషన్‌ ఫామ్‌లో మార్పులు అవసరమని, కొన్ని అంశాలను నిర్ణయించేందుకు కనీసం 4నుంచి 6వారాల
సమయం పడుతుందని రాజన్‌ తెలిపారు. ఏ సాంకేతిక ప్రక్రియకైనా సమయం అనువుగా ఉండాలన్నారు. మార్పులు చేసిన సిఎఎఫ్‌ను
టెలికాం శాఖ జారీ చేస్తుందని దాన్నే దేశవ్యాప్తంగా ఆపరేటర్లు ఉపయోగ్సించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే వినియోగిస్తున్న
సిమ్‌లను పునఃతనిఖీ చేసేందుకు ఒటిపి ద్వారా ఆధార్‌ ఆధారిత తనిఖీ విధానాన్ని సరళీకరించాలని ప్రభుత్వం గత నెల్లో ప్రకటించింది.
ఇప్పటికే స్టోర్లలో జరుగుతున్న ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించింది.