ఆధార్‌ లింక్‌ తుది గడువు ఆగస్టు 31: కేంద్ర ఆదాయ పన్ను శాఖ

 

TAX DEPARTMENT
TAX DEPARTMENT

 

దిల్లీ: పాన్‌కార్డును ఆధార్‌తో లింక్‌ చేసే గడువును ఆగస్టు 31 వరకు ప్రభుత్వం పొడిగించింది.
గడువులోగా లింక్‌ చేయని పాన్‌కార్డులు రద్దవుతాయని రెవెన్యూ కార్యదర్శి హన్ముఖ ఆదియా
తెలిపారు. అదే విధంగా పన్ను చెల్లించడానికి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరక్ట్‌ టాక్సెస్‌ కూడా
ఆధార్‌కు పాన్‌ లింక్‌ తప్పనిసరి చేసింది. ఈ కారణంతోనే ఆదాయ పన్ను చెల్లింపు తేదీని
ఆగస్టు 5 వరకు పొడిగిస్తూ ఆదాయ పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆదాయ పన్ను శాఖ
అధికారిక వెబ్‌సైట్‌పై పడుతున్న భారాన్ని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు
ప్రభుత్వం తెలిపింది.జూలై 1 నుంచి ఆధార్‌ను పాన్‌కార్డు లింక్‌ తప్పనిసరి చేసిన సంగతి
తెలిసిందే. కానీ, పాన్‌కు ఆధార్‌ను లింక్‌ చేయని ఎడల రద్దు అవుతుందని అనే నిబంధనను
ప్రకటించడం ఇదే ప్రథమం. కావున సాధ్యమైనంత వరకు పాన్‌కార్డును ఆధార్‌ను లింక్‌
చేయాలని ఆదాయ పన్ను శాఖ కోరింది.