అశ్లీల వీడియోలను వీక్షించి అత్యాచారం

Sexual Abuse
Sexual Abuse

డెహ్రడూన్‌ : ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. అశ్లీల వీడియోలు చూసి 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు బాలురు 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. మొబైల్ ఫోన్‌లో రెండు రోజులపాటు పోర్న్ వీడియో చూసిన బాలురు ఆ తర్వాత చిన్నారిని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డెహ్రాడూన్‌లోని సాహస్‌పూర్‌లో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాహస్‌పూర్‌ చెందిన ఐదుగురు బాలురు, అక్కడే ఉన్న బాలికను ఆడుకుందామని నమ్మించి ఓ స్నేహితుడి ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు రెండు రోజుల ముందు ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూసినట్లు నిందితుల్లో ఒకడైన బాలుడు తెలిపారన్నారు. అనంతరం బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాల్య గృహంకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.