అర్నాబ్‌ గోస్వామిపై కేసు నమోదు

Arnab Goswami
Arnab Goswami

ముంబాయి: ఓ వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రఖ్యాత టివి వ్యాఖ్యాత, రిపబ్లిక్‌ టివి చీఫ్‌ ఎడిటర్‌ అర్నాబ్‌ గోస్వామిపై ముంబాయిలో అలీబాగ్‌ ఠాణాలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఇంటీరియర్‌ డిజైనర్‌గా పనిచేస్తున్న అన్వా§్‌ు నాయక్‌ తనకు అర్నాబ్‌ గోస్వామి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదని శనివారం అలీభాగ్‌లో తన బంగ్లాలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాయక్‌ వద్ద లభించిన ఆత్మహత్య లేఖ ఆధారంగా ఆయన భార్య అలీభాగ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. నాయక్‌ భార్య అక్షత ఫిర్యాదు మేరకు గోస్వామితో పాటు మరో ఇద్దరు ఫిరోజ్‌ షేక్‌, నితిష్‌ సార్థాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు అడిషనల్‌ సూపరింటెండెంట్‌ పోలీస్‌ అధికారి సంజ§్‌ుపాటిల్‌ తెలిపారు. రిపబ్లిక్‌ టివి నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని నాయక్‌ భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు. రిపబ్లిక్‌ టివి మాత్రం అక్షత ఆరోపణలను ఖండించింది. నాయక్‌కు చెల్లించాల్సిన బకాయిలను వాయిదా పద్ధతిలో మొత్తం చెల్లించామని, తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఆధారాలను తగిన సమయంలో అధికారుల ఎదుట ఉంచుతామని పేర్కొంది. నాయక్‌ ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో తమ వద్ద పూర్తి ఆధారాలు లేవని, శవపంచానామా నివేదిక వచ్చిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నాయక్‌ భార్య చేస్తున్న ఆరోపణలపై స్పష్టత లేదని, పూర్తి ఆధారాలు లభించేవరకు ఎవ్వరిని అరెస్ట్‌ చేయలేమని పోలీస్‌ అధికారులు వెల్లడించారు.