అర్ధ్ర‌రాత్రి పుదుచ్చేరి వీధుల్లో కిర‌ణ్ బేడి చ‌క్క‌ర్లు

kiran bedi
kiran bedi

న్యూఢిల్లీః ఓ గవర్నరు తానెవరనేది ప్ర‌జ‌ల‌కు తెలియకుండా అర్ధరాత్రి వేళ బయటకు వెళ్లారు. మహిళ భద్రత ఎలా ఉందో స‌మీక్షించేందుకు సాక్షాత్తూ గవర్నరు ఓ అజ్ఞాత వ్యక్తి మాదిరిగా ద్విచక్రవాహనంపై వెళ్లి పరిశీలించారు. ఆమె మరెవరో కాదు.. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నరు కిరణ్‌బేడి. ఎవరూ ఆమెను గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖానికి చున్నీ కప్పుకున్నారు. ఎటువంటి భద్రత లేకుండా అర్ధరాత్రి వేళ ఆమె ఎంతో ధైర్యంగా ద్విచక్రవాహనంపై పర్యటించారు. ఈ విష‌యాన్ని ఆమె స్వయంగా ట్విట్ట‌ర్‌ ద్వారా తెలియజేశారు. ‘పుదుచ్చేరిలో రాత్రివేళ బయట ఉండటం సురక్షితమే. కానీ భద్రతను మరింత మెరుగుపరుస్తాం’. ప్రజలు తమకు ఏదైనా అవసరమైతే పీసీఆర్‌, 100కు ఫోన్‌ చేసి సహాయం తీసుకో
వాల్సిందిగా ఆమె కోరారు.