అమ‌లాపాల్‌కు కోర్టు ఆదేశం…

Amala Paul New Photos-7
Amala Paul

పుదుచ్చేరి: ఖరీదైన కారు రిజిస్ర్టేషన్‌కు సంబంధించి పన్ను ఎగవేత కేసులో దక్షిణాది నటి అమలాపాల్‌కు కేరళ హైకోర్టు రాష్ర్ట నేర విభాగ శాఖ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి నటి అమలాపాల్‌ ముందస్తు బెయిల్‌ కోసం గతేడాది డిసెంబరు 21న కేరళ హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. దీనిపై విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయరాఘవన్‌.. జనవరి 15లోగా నేర విభాగశాఖ ఎదుట హాజరుకావాలని పేర్కొన్నారు. 2017 ఆగస్టులో రూ.1.12కోట్ల విలువైన బెంజ్‌ కారును కేరళలో వాహన రుణం తీసుకొని కొనుగోలు చేశారు. దీని రిజిస్ర్టేషన్‌కు సుమారు 20శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. అమలాపాల్‌ ఈ పన్ను ఎగవేయడానికి నకిలీ పత్రాలతో పుదుచ్చేరిలో రిజిస్ర్టేషన్‌ చేయించడంతో కేరళ నేరవిభాగ పోలీసులు గతేడాది నవంబరులో కేసు నమోదు చేశారు.