అమరులకు రాజ్‌నాథ్‌ నివాళి

Rajnath Singh carries a coffin with a soldier's body
rajnath singh, home minister

బుద్గామ్‌: పుల్వామా ఎన్‌కౌంటర్‌లో అమరులైన జవాన్ల శవపేటికలను హోంమంత్రి రాజ్‌నాథ్‌ భుజాలపై మోసి సైన్యం పట్ల కృతజ్ఞతాభావాన్ని చాటుకున్నారు. వీర్‌జవాన్‌ అమర్‌ రహే నినాదాలతో కాశ్మీర్‌లోని బుద్గామ్‌ సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌ దద్దరిల్లింది. పుల్వామా ఆత్మాహుతి దాడిలో అమరులైన జవాన్లకు అంజలి సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మిలిటరీ అధికారులు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి రాజ్‌నాథ్‌, జమ్ము-కాశ్మీర్‌ డిజిపి దిల్బాగ్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. అమరులకు కేంద్ర హోం మంత్రి నివాళులు అర్పించారు.