అనాదిగా వస్తున్న ఆచారమే

LORD AYYAPPA TEMPLE
LORD AYYAPPA TEMPLE

మాదేవునికి ఇష్టం ఉండదు
శబరిమలై కేసులో వాదనలు
న్యూఢిల్లీ: దీర్ఘకాలికంగా వస్తున్న సాంప్రదాయం ప్రకారంచూస్తే 10 నుంచి 50 ఏళ్లలోపు ఉన్న మహిళలను శబరిమలై అయ్యప్ప దేవాలయంలోనికి అనుమతించడంలేదని, ఈ వయసు మధ్యలో మహిళలు రావడాన్ని అయ్యప్పదేవుడు కోరుకోడని దేవాలయం తరపున్యాయవాది కె.పరాశరన్‌ సుప్రీంకోర్టుకు బుధవారం నివేదించారు. పరాశరన్‌ తన వాదనను వినిపిస్తూ ఈ వయసు వారు మినహా ఇతరులు దేవాలయంలోనికి అనుమతిస్తారని ఆయన అన్నారు. సుప్రీం చీఫ్‌జస్టిస్‌ దీపక్‌మిశ్రా, జస్టిస్‌ రోహింటన్‌నారిమన్‌,ఎఎం ఖాన్విల్కర్‌, డివై చంద్రచూడ్‌, ఇందు మల్హోత్రాలతో కూడిన బెంచ్‌ శబరిమలైలో మహిళలను అనుమతించకపోవడంపై దాఖలయిన పిటిషన్‌ను విచారిస్తున్నారు. బుధవారం నాటి విచారణలో దేవాలయం తరపు న్యాయవాది తన వాదనను వినిపించారు. నాయర్‌సొసైటీ తరపున ఆయన వాదనలు వినిపించారు. శబరిమల దేవాలయం ప్రపంచంలోనే ఉన్న ఏకైక దేవాయమని హిందువులు,క్రిస్టియన్లు,ముస్లింలు, విదేశీయులకు సైతం అనుమతి ఉందని, అయితే శతాబ్దాల తరబడి వస్తున్న సాంప్రదాయాన్నిచూస్తే మహిళలు ప్రత్యేకించి 10నుంచి 50 ఏళ్ళలోపున్నవారిని అనుమతించరని, ఈదేవాలయంలో ఉన్న దేవుడు బ్రహ్మచారి కావడంతో ఆసాంప్రదాయాన్ని పాటిస్తారని అన్నారు. కోర్టు ఈ విధానాన్ని రద్దుచేసిన పక్షంలో ఈ దేవాలయానికి ఉన్న పురాతన సాంప్రదాయాన్ని పునరుద్ధరించలేనివిధంగా దెబ్బతీసినట్లవుతుందని, భక్తుల మనోగతాన్నిసైతం దెబ్బతీసినట్లవుతుందని, రాజ్యాంగంలోని 25(1)ప్రకారం భక్తుల మనోభావాలకు విఘాతం కలుగుతుందని అన్నారు. ఈకేసులో సామాజిక సమస్యలు ఏమీ లేవని, ఇదొక భక్తిప్రపత్తులకు సంబంధించిన అంశమని, 25(2) వినియోగించడం ద్వారా ఒక దేవునికి ఉన్న ప్రాచీన సాంప్రదాయ పద్దతులను సంస్కరించడం అనేది వీలుకాని అంశమని న్యాయవాదిపరాసరన్‌ వాదించారు. భక్తుల ఆధ్యాత్మికభావాలతోపాటు దేవుణ్ణి ఆరాధించే భక్తుల మనోభావాలను దెబ్బతీయకూడదని ఆయన వాదించారు. తాను పూజించే దేవుడు బ్రహ్మచారి కాదని తేలితే ఆ భక్తుడు ఇక ఆగుడికి వెళ్లడని ఆయన అన్నారు. కేరళలోని అన్ని అయ్యప్ప దేవాలయాల్లో మహిళల ప్రవేశానికి అనుమతినిస్తారని, ఎలాంటి వివక్ష లేదని అన్నారు. పదినుంచి 50 ఏళ్ల మహిళలను అనుమతించడంవల్ల దేవాలయ ప్రాశస్త్యం దెబ్బతింటుందని, ఆదేవుడికిసైతం ఇష్టం ఉండదని అందువల్లనే ఈ ప్రత్యేక వయసు గ్రూప్‌ వారిని అనుమతించడంలేదని న్యాయవాదిపరాశరన్‌ వాదించారు. స్వామి అయ్యప్ప వ్యక్తిత్తమే నైష్ఠిక బ్రహ్మచారి అని రాజ్యాంగం ప్రకారంన్యాయవ్యవస్థసైతం ఈ అంశంలో జోక్యంచేసుకునేందుకు వీలులేదని అన్నారు. మహిళలను అనుమతించకపోవడంపై జస్టిస్‌ చంద్రచూడ్‌ చేసిన వ్యాఖ్యలను పరిగణనలోనికి తీసుకని పరాశరన్‌మాట్లాడుతూ కేరళలో 96శాతం మందిమహిళలు విద్యావంతులేనని, ఇదొక మాతృస్వామ్య సమాజమని శబరిమలై దేవాలయంలో ఆచారవ్యవహారాలు పితృస్వామ్య వ్యవస్థలో ఉన్నాయనడం ప్రాథమికంగా కూడా వాస్తవం కాదని అన్నారు. భక్తులు 41రోజుల దీక్ష ఆ తర్వాత యాత్రలో కూడా మహిళలరాకను అనుతించరని, ఈ దేవదేవునికి ఉన్న సాంప్రదాయాలను హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థలై గౌరవించాల్సిందేనని అన్నారు. అంతేకాకుండా పరాశరన్‌ తన వాదనల్లో ఇక్కడ చట్టాలు శాసనకర్తలంటే బ్రహ్మ అని కార్యనిర్వాహకులు విష్ణువు అని పరమశివుడు న్యాయవ్యవస్థ అని ఎందుకంటే శివుని అర్ధనారీశ్వరతం రాజ్యాంగంలోని 14వ అధికరణం ప్రకారం స్త్రీపురుషుల సమానత్వాన్ని ప్రభోదిస్తోందని అన్నారు. శివుడు బ్రహ్మచారి కాదని, కామదేవ ఆతని తపస్సును భగ్నంచేయడాన్నియత్నిస్తే శివుని ధృక్కులకు భస్మం అయ్యాడని, శివుని తపస్సును కామదేవుడు గౌరవించలేదన్నారు. అయితే విచారణలో జస్టిస్‌ నారిమన్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌లుమాట్లాడుతూ దేశంలోని అన్ని దేవాయాల్లోను అన్ని తరగతులకు చెందినభక్తులుమహిళలను అనుమతిస్తున్నారా లేదా అనిప్రశ్నించారు. రాజ్యాంగంలోని అధికరణం 25(2)(బి)ప్రకారం అందరినీ అన్నివర్గాలను అనుమతించాలని అన్నారు. ఈ హక్కులు సామాజిక సంస్కరణలకు వర్తిస్తాయని, భక్తిభావాలకు కాదని, 26వ అధికరణం సెక్షన్‌(బి)కింద ఈ హక్కులు వర్తించవని అన్నారు. దీనితోప్రధాన న్యాయమూర్తి మహిళలనే ఎందుకు నిషేదించాలని ప్రశ్నించారు. ఏళ్లరతబడి ఈ విధానం కొనసాగుతున్నందున ఖచ్చితంగా అమలుచేయాలని అన్నారు. ఒక ప్రత్యేక వయసుకు చెందినమహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడం వల్ల రాజ్యాంగంలోప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లవుతుందని న్యాయమూర్తి జస్టిస్‌ నారిమన్‌పేర్కొన్నారు. ట్రావన్కూరు బోర్డు పరిధిలోని దేవాలయాలు ఈ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని అన్నారు. తిరిగి వాదనలు గురువారానికి వాయిదా పడ్డాయి.