అధికారులను బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది

DIG Roopa
DIG Roopa

అధికారులను బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది

బెంగళూరు: అధికారులను బదిలీచేసే అధికారి ప్రభుత్వానికి ఉందని ఐపిఎస్‌ అధికారి డి.రూప అన్నారు. తన బదిలీ పై ఆమె స్పందిస్తూ , ప్రభుత్వ ఆదేశాలను తాను పాటిస్తున్నానన్నారన్నారు.. పరప్ణ అగ్రహార జైలు డిఐజి హోదాలో ఉన్న ఆమెను ట్రాఫిక్‌ విభాగానికి బదలీ చేశారు.. జైలులో ఎఐఎడిఎంకె నాయకురాలు శశికళకు ప్రత్యేక సౌకర్యాలు అందుతున్నాయని దీనిపై ఉన్నతాధికారులకు రూ.2కోట్లు లంచంగా ఇచ్చిందని రూప ఆరోపించారు.. దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని ఆమె కోరిన విషయం విదితమే.. అనంతర పరిణామాల్లో రూపను అక్కడి నుంచి బదిలీ చేశారు.