అక్టోబర్‌ 2 నుంచి అన్నా హజారే దీక్ష

ANNA HAJARE
ANNA HAJARE

రాలేగావ్‌ సిద్ధి: అవినీతిని నిరోధించేందుకు లోక్‌పాల్‌ నియామకంలో జాప్యానికి నిరసనగా అక్టోబర్‌ రెండో తేది నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు సామాజికి కార్యకర్త అన్నా హజారరే ఆదివారం తెలిపారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలోని తన సొంత గ్రామం రాలేగావ్‌ సిధ్దిలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా లోక్‌పాల్‌ కోసం దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. లోక్‌పాల్‌ బిల్లుకు 2014 జనవరిలో రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే లోక్‌పాల్‌ వ్యవస్థను నియమిస్తానని ఇచ్చిన హామీని కేంద్రం నిలుపుకోలేదన్నారు.