అందర్నీ దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రూపొందిచాం

Mody
Mody

న్యూఢిల్లీ: ఈరోజు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ కేవలం ట్రయిలర్‌ మాత్రమేనని ఎన్నికల తర్వాత భారత్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకేళ్తానని మోడి అన్నారు. మధ్యతరగతి వారి నుండి కార్మికుల వరకూ రైతుల అభివృద్ధి నుంచి వ్యాపారుల అభివృద్ధి వరకూ, ఉత్పత్తి రంగం నుంచి ఎంఎస్ఎంఈ రంగం వరకూ, ఆర్థిక వృద్ధి నుంచి న్యూ ఇండియా అభివృద్ధి వరకూ, అందర్నీ దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం బడ్జెట్ రూపొందించిందని చెప్పారు. ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం’ కింద సొంతంగా 5 ఎకరాలు, అంతకంటే తక్కువ భూమి ఉన్న 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రధాని చెప్పారు.