హిందీ రీమేక్‌ రైట్స్‌

A Still From Vittal wadi

ఎస్‌ఎస్‌ ఎక్స్‌పీరియన్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై రోహిత్‌ , సుధారావత్‌ నటీనటులుగా నాగేందర్‌ దర్శకత్వంలో నరేష్‌రెడ్డి రియల్‌ ఇన్సిడెంట్‌ ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం విట్టల్‌ వాడి.. ఈ కొత్త మూవీ రిలీజ్‌కు రెడీ అయిన సందర్భంగా యూనిట్‌ సినీ ప్రముఖులకు సినిమా ప్రివ్యూ చూపించారు.. సినిమా ప్రివ్యూ చూసిన కొందరు ప్రముఖులు సినిమా బాగా చిత్రీకరించారని సాంగ్స్‌, సినిమాకు హైలెట్‌ అని రోషన్‌ కోటి మ్యూజిక్‌ చాలా బావుందని కొత్తవాళ్లూనా హీరో రోహిత్‌ను హీరోయిన్‌ను మెచ్చుకున్నారు. గొప్ప కథ ను ప్రేక్షకులకు అందించబోతున్నట్టు డైరెక్టర్‌ నాగేందర్‌ , ప్రొడ్యూసర్‌ నరేష్‌ను అభినందించారు. ఈచిత్రం నిర్మాత మాట్లాడుతూ, ఇందులో రొమాంటిక్‌ సీన్స్‌ బాగా వచ్చాయన్నారు. సినిమా చూసిన గురుదేవ్‌ పిక్చర్స్‌ అధినేత ప్రమోద్‌కుమార్‌ సినిమా బాగుందని హిందీలో ఒక ప్రముఖ నటుని కుమారుడిని లాంచ్‌ చేయటానికి హిందీ రీమేక్స్‌ రైట్స్‌ కోసం ఆసక్తి చూపుతున్నారన్నారని హర్షం వ్యక్తం చేశారు. విట్టల్‌వాడిని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/