మేలో వస్తున్న ‘విశ్వామిత్ర’

Viswamitra Comming in May
Nandita raj


అందరూ తన వాళ్లే అనుకునే ఓ మద్యతరగతి అమ్మాయి నందితా రాజ్‌, జీవితంలో ఆమెకు ఎదురైన సమస్యలను ఓ అజ్ఞాత వ్యక్తి పరిష్కరిస్తాడు.. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? అనేది మా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటున్నారు. రాజకిరణ్‌.. సృష్టికి, మనిషి ఊహకు ముడిపెడుతూ ఆయన దర్శకత్వం వహించిన సినిమా విశ్వామిత్ర.. ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్‌ సినిమా పతాకంపై మాధవి అద్దంకి , రజనీకాంత్‌ ఎస్‌. రాజకిరణ్‌ నిర్మిస్తున్న చిత్రం విశ్వామిత్ర.. నందితారాజ్‌, సత్యం రాజేష్‌ జంటగా నటించారు.. అశుతోష్‌ రాణా, ప్రసన్నకుమార్‌ ప్రధాన పాత్రలు పోషించారు.. గీతాంజలి త్రిపుర వంటి హిట్‌ చిత్రాతో ప్రేక్షకులను మెప్పించిన రాజకిరణ్‌ దర్శకత్వం వహించారు.. మేలో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.. రాజకిరణ్‌ మాట్లాడుతూ విశ్వంలో మానవ మేధస్సుకు అందరని విషయాలు చాలా ఉన్నాయన్నారు. సృష్టిలో ఏది జరుగుతుందో ..ఏది జరగదో చెప్పటానికి మనుషులు ఎవరు.. ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే..ఎప్పటికీ నిలిచే సృష్టిలో మనుషులు కొంతకాలం మాత్రమే జీవిస్తారని చెప్పే, ప్రయత్నమే మా చిత్రమన్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో రూపొందించామని తెలిపారు. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రమన్నారు..