కొడుకు సినిమాలో విలన్‌గా

విక్రమ్‌ సినిమా హాట్‌ టాపిక్‌

Hero Vikram with son Dhruv
Hero Vikram with son Dhruv

విక్రమ్‌.. ఆయనసినిమాలు అంటే అటు తమిళ్‌తోపాటు తెలుగులో కూడ మంచి ఆదరణ ఉంది.. విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ కూడ మన తెలుగు బ్లాక్‌ బస్టర్‌ అర్జున్‌రెడ్డి సినిమా రీమేక్‌తో తమిళ తెరకు పరిచయమై మంచి విజయాన్ని ఖాతాలో జమచేసుకున్నారు..

అయితే ఇపుడు ఇద్దరూ కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకతంలో నటించనున్నారు.. దీంతో ఇద్దరు తండ్రి కొడుకులు ఒకే చిత్రంలో నటించటం అనేది మంచి హాట్‌ టాపిక్‌గా మారింది..

అయితే ఈచిత్రంలో విక్రమ్‌ విలన్‌ రోల్‌లో కన్పించనున్నారని టాక్‌.. దీనికి సంబంధించి మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/