మరో బిజినెస్ లోకి విజయ్ దేవరకొండ

ఏషియన్ సినిమాస్ తో కలిసి బిజినెస్

Vijay Devarakonda
Vijay Devarakonda

హైదరాబాద్‌: చాలా తక్కువ కాలంలోనే అగ్ర హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ కేవలం సినిమాలకే పరిమితం కావడం లేదు. వ్యాపారం రంగంలో కూడా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ‘రౌడీ’ పేరుతో దుస్తుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. తాజాగా మరో బిజినెస్ ప్రారంభించబోతున్నాడు. మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్ లోకి ఎంటర్ కాబోతున్నాడు. ఏషియన్ సినిమాస్ తో కలిసి ఈ వ్యాపారాన్ని నిర్వహించబోతున్నాడు. ఏవీడీ పేరుతో మహబూబ్ నగర్ లో తొలి మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేయబోతున్నాడు. మహేష్ బాబు కూడా ఇప్పటికే ఈ బిజినెస్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మహేష్ సరసన విజయ్ దేవరకొండ నిలవబోతున్నాడు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/