‘వెన్నెల’ పోస్టర్‌

శివానీరాజశేఖర్‌కు యూనిట్‌ శుభాకాంక్షలు

Sivani Rajasekhar
Sivani Rajasekhar

త్వరలో రానున్న ఒక ఫాంటసీ లవ్‌స్టోరీలో ‘వెన్నెల అనే క్యూట్‌ రోల్‌లో శివానీ రాజశేఖర్‌ పరిచయంకాబోతున్నారు..

ఇంకా టైటిల్‌పెట్టని ఈ సినివిూలో తేజ సజ్జాహీరోగా నటిస్తున్నారు. జూలై1 న శివానీ బర్త్‌డే సందర్బంగా సినిమాలో ఆమె పోషిస్తున్న క్యారెక్టర్‌ పరిచయ పోస్టర్‌న విడుదల చేశారు..

టాలీవుడ్‌ ప్రముఖ నటులు రాజశేఖర్‌, జీవిత రాజశేఖర్‌ కుమార్తె అయిన శివానీ ఆ పోస్టర్‌లో మన పక్కింటి అమ్మాయి తరహాలో లుక్‌లో ఆకట్టుకుంటోంది..

పెళ్లిగోల అనే వెబ్‌సిరీస్‌తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న మల్లిక్‌రామ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

యుఎస్‌కుచెందిన డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఎస్‌ ఒరిజినల్స్‌, మహాతేజ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/