నిజానికి ఇది నాన్నగారి కల: వెంకటేష్‌

వెంకటేష్‌, నాగచైతన్య హీరోలుగా దర్శకుడు కెఎస్‌ రవీంద్ర తెరకెక్కించిన చిత్రం వెంకీమామ, రాశీఖన్నా, పాయల్‌రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి.. శుక్రవారం (నేడు) విడుదల సందర్భంగా హీరో వెంకటేష్‌తో ఇంటర్వ్యూ విశేషాలు..మీకోసం..

Venkatesh


రియల్‌లైఫ్‌ మామా అల్లుళ్లం ,,రీల్‌ లైఫ్‌లో మామ అల్లుళ్లుగా చేస్తున్నాం.. చాలా సంతోషంగా ఉంది.. నిజానికి ఇది నాన్నగారి కల.. ఆయన ఎప్డుఊ రానాతో ఒక సినిమా చేయాలి..చైతూతో ఒక సినిమా చేయాలని అనిఅనేవారు. కానీ అపుడు కుదరలేదు.. చైతూ చిన్నప్పడు చాల క్యూట్‌గా ఉండేవాడు.. అందరం వాడిని ఎత్తుకోవటానికి పోటీపడేవాళ్లం.. నా కళ్లముందు పెరిగిన వాడు ఇపుడు హీరోగా నాతో పాటు చేయటం ఆశ్చర్యంగా అన్పిస్తోంది..
వెంకీమామ చిత్రం కామెడీ, యాక్షన్‌, ఎమోషన్స్‌, సాంగ్స్‌ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ ఉన్న మూవీ.. చైతూకి కొద్దిరోజులు అడ్జస్ట్‌ కావటం టైం పట్టింది.. వాడు సెట్స్‌లో అదోలా ఉంటుంటే.. నీ మైండ్‌లో ఏమి ఆలోచిస్తున్నావ్రాఝ అని అడిగా.. తర్వాత మెల్లగా వాడు సెట్‌ అయ్యాడు. నాకంటే ముందే సెట్స్‌కి వచ్చి రెడీగా ఉండేవాడు.. ఈచిత్రంలో రెండు పాత్రలకు సమానస్క్రీన్‌ స్పేస్‌ ఉంటుంది. అలాగే స్క్రీన్‌పై వెంకటేష్‌, నాగచైతూ కన్పించరు… మామ అల్లుళ్లు తప్ప..
వరుణ్‌తో చేసిన ఎఫ్‌2 వెరీ గుడ్‌.. చాలా బాగుంది.. వరుణ్‌, చైతూల నుండి కూడ నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను.. ఈ ఇద్దరు యంగ్‌ హీరోలతో చేయటం నేను బాగా ఎంజా§్‌ు చేశాను.జూనియర్‌ ఎన్టీఆర్‌తో చేయాలి..నానితో అనుకున్నాం కుదరలేదు. ఇండస్ట్రీలో ఉన్న అందరూ యంగ్‌ హీరోలతో చేయాలి అనుకుంటున్నా..
ప్రస్తుతం సినిమా బిజినెస్‌, కాన్సెప్ట్‌ నిర్మాణం ఇలా అన్నింటిలో మార్పులు వచ్చాయి. మార్పు అనేది సాధారణం. మరియు మంచిది కూడా. .మనం దాన్ని అంగీకరించాల్సిందే..గౌతమ్‌ చాలా చిన్నవాడు.. అలాగే వాళ్ల కెరీర్‌ గురించి వాళ్లు ఆలోచించుకోవాలి..

తదుపరి 75వ చిత్రం గురించి: ఈ నంబర్లు వద్దమ్మా.. ఈ నెంబర్ల సెంటిమెంట్‌ నాకు లేదు. అది అనౌన్స్‌్‌ చేసేటపుడు చూద్దాం.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/