వెంకటేశ్‌ కుమార్తె ఆశ్రిత ప్రీ వెడ్డింగ్‌

Venkatesh Daughter Wedding
Venkatesh Daughter Wedding

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేశ్‌ కుమార్తె ఆశ్రిత హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితోపెళ్లి జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా పెళ్లి వేడుకల కోసం ఇరు కుటుంబ సభ్యులు శుక్రవారం జయపుర చేరుకున్నారు. ఆదివారం ఆశ్రిత వివాహం జరగనుంది.ఈ మేరకు శుక్రవారం రాత్రి జయపురలో ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు నిర్వహించారు. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పెళ్లి సంగీత్‌లో నాగచైతన్య, సమంత, రానా తదితరులు నృత్య ప్రదర్శన ఇవ్వబోతున్నారట. జయపురలోని ఓ ప్రముఖ హోటల్‌ పెళ్లికి వేదికైనట్లు చెబుతున్నారు. శనివారం సాయంత్రం సంగీత్‌, ఆదివారం వివాహ వేడుక జరగనున్నాయి. ఫిబ్రవరి 6న ఆశ్రిత, వినాయక్‌ల నిశ్చితార్థం జరిగిందట. చాలా ఏళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దల అనుమతితో ఒక్కటి కాబోతున్నట్లు తెలిసింది

.
మరిన్ని సినీమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/