తర్వాత సినిమా రెడీ

VARUN TEJ

మెగా హీరో వరుణ్‌తేజ్‌ తర్వాతి సినిమాను బాక్సింగ్‌ నేపథ్యంలో చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం ఈచిత్రం తొలిషెడ్యూల్‌ ఫిబ్రవరి 17 నుంచి వైజాగ్‌లో ప్రారంభం కానుందని తెలిసింది.. ఈచిత్రంలో సునీల్‌శెట్టి కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈచిత్రం కోసం వరుణ్‌తేజ్‌ ప్రత్యేకంగా బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. ఈచిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీన్ని దృష్టిలోపెట్టుకుని నిర్మాతలు సినిమాపై పెద్దమొత్తంలో వెచ్చిస్తున్నారని తెలిసింది.. అల్లు అరవింద్‌ సమర్పణలో ఈచిత్రాన్ని కిరణ్‌ కొర్రపాటి డైరెక్టు చేస్తున్నారు.. అల్లు బాబీ, సిద్దు ముద్దా సంయుకతంగా నిర్మిస్తున్నారు. హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ లార్నెల్‌ స్టోవాల్‌ ఈచిత్రానికి స్టంట్స్‌ కంపోజ్‌చేస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/