‘యురి’ నటుడు కన్నుమూత

Navtej Hundal
Navtej Hundal


ముంబై: బాలీవుడ్‌ నటుడు నవ్‌తేజ్‌ హుందాల్‌ కన్నుమూశారు. సోమవారం సాయంత్రం ముంబైలోని నివాసంలో నవ్‌తేజ్‌ హుందాల్‌ తుదిశ్వాస విడిచారు. విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలో వచ్చిన యురి..ది..సర్జికల్‌ స్ట్రైక్‌ చిత్రంలో నవ్‌తేజ్‌ హుందాల్‌ హోంమంత్ర పాత్రలో నటించారు. నవ్‌తేజ్‌ మృతి పట్ల సినీ, టివి ఆర్టిస్టు అసోసియేషన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నవ్‌తేజ్‌ కుటుంబసభ్యులకు అసోసియేషన్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. నవ్‌తేజ్‌కు భార్య అంతిక హిందాల్‌, ఇద్దరు కూతుళ్లున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/