మోడి బయోపిక్‌ తాజా పోస్టర్‌ విడుదల

Nitin Gadkari and actor Vivek Oberoi
Nitin Gadkari and actor Vivek Oberoi

నాగ్‌పూర్‌: ప్రధాని మోడి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోడి’ అయితే తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా వివేక్‌ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికలపై ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు అన్ని బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌పై మేమంతా ఆనందంగా ఉన్నాం. కొద్దిరోజుల క్రితం బీజేపీకి తక్కువ సీట్లు వస్తాయని మాట్లాడారు. కానీ, మేమెప్పుడూ భయపడలేదు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనూ ప్రధాని మోదీపై ప్రజలు చూపించిన ప్రేమ, ఆప్యాయత వెలకట్టలేనిది. అని ఒబెరాయ్‌ పేర్కొన్నారు. ఈ చిత్రంలో మోడి పాత్రను బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ పోషిస్తున్నారు. మేరీకోమ్‌, సరబ్‌జిత్‌ వంటి చిత్రాలు తీసిన ఒముంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు.


మరిన్ని సినీమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/