ఉదయ్ కిరణ్ బయోపిక్ హాట్ టాపిక్

Actor Uday Kiran (File)

తాజాగా మరోసారి ఉదయ్ కిరణ్ బయోపిక్ హాట్ టాపిక్ గా మారింది.  రీసెంట్ గా ఒక ఫిలిం మేకర్ ఉదయ్ కిరణ్ బయోపిక్ ను తెరకెక్కించే ప్రయత్నాలు మొదలు పెట్టారట.  దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతోందని.. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ పాత్రకు ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం.  వారిలో ఒకరు రాజ్ తరుణ్ కాగా మరొకరు సందీప్ కిషన్ అని అంటున్నారు.  ఇంతకు మించి ఈ బయోపిక్ గురించి పెద్దగా వివరాలేమీ బయటకు రాలేదు.  త్వరలోనే ఈ సినిమా అప్డేట్ రానుందని సమాచారం.
 ‘చిత్రం’ (2000) సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఉదయ్ కిరణ్.. ‘నువ్వు నేను’.. ‘మనసంతా నువ్వే’ సినిమాలతో అప్పట్లో ఒక్కసారిగా యూత్ కు ఫేవరెట్ హీరోగా మారాడు. తర్వాత కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు.  2014 లో ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. ఉదయ్ అకాలమరణం అటు ఇండస్ట్రీ వర్గాలను.. ఇటు ప్రేక్షకులను కలచివేసింది. 

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/