విలక్షణ నిఘంటువు : ‘గొల్లపూడి’

Gollapudi Maruti Rao (File)

ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరనిలోటుగా మిలిగింది.. వయోసంబంధిత అనారోగ్యం కారణంగా ఆయన కన్నుమూశారని తెలిసింది. సినీరంగ ప్రముఖులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇటీవల గొల్లపూడి చివరగా ఆది హీరోగా వచ్చిన ‘జోడీ’ చిత్రంలో ఒక పాత్ర చేశారు. రచయితగా తనప్రస్థానం మొదలుపెట్టిన గొల్లపూడి ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా మారారు.. విలక్షణ నటన, వ్యంగ్యంతో కూడి డైలాగ్‌ డెలివరీ ఆయనకు నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.. దీంతో దశాబ్దాల పాటు క్యారెక్టర్‌ ఆర్టిస్టగా , విలన్‌గా, కమెడియన్‌గా అనేక పాత్రలు చేశారాయన..


గొల్లపూడి 1939 ఏప్రిల్‌ 14న విజయనగరంలోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.ఆయన తల్లిదండ్రు అన్నపూర్ణ, సుబ్బారావు, వారు జీవితాంతం విశాఖపట్నంలోనే నివాసమున్నారు. సిబిఎం ఉన్నత పాఠవాల, ఎవిఎన్‌ కళాశాల, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మారుతీరావు విద్యాభ్యాసం చేశారు.ఆయన మేథమేటికల్‌ బౌతిక శాస్త్రములో బిఎస్సీ (ఆనర్స్‌)చేశౄరు. గొల్లపూడి అన్నపూర్ణ, సుబ్బారావుల అయిదోసంతానం.

రచనా ప్రస్థానం:

మారుతీరావు రాసిన తొలి కథ ‘ఆశాజీవి ప్రొద్దటూరు నుంచి వెలువడే స్థానిక పత్రి రేనాడులో 1954, డిసెంబర్‌ 9న వెలువడింది.. చిన్నవయసులోనే రాఘవ కళానికేతన్‌ పేరున ఆయనొక నాటక బృందాన్ని నడిపారు. ఆడది (పినిశెట్టి), కుక్కపిల్ల దొరికింది. స్వయంవరం (రావి కొండలరావు), రిహార్సల్స్‌ (సోమంచి యజ్ఞన్నశాస్త్రి), వాపస్‌ (డివినరసరాజు)., మహానుభావులు (గోగోల్‌ రాసిన యాన్‌ ఇన్‌స్పెక్టర్‌ కాల్స్‌ ఆధారంగా సోమంచి చేసిన రచన),వంటి నాటకాలకు నిర్మాణం, దర్శకత్వంలో వహించటంతోపాటు , ప్రధానపాత్రధారిగా నటించారు.

Gollapudi Maruti Rao

మారుతీరావు 1959లో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1960 జనవరి 13న చిత్తూరులో పత్రిక యొక్క మరో ఎడిషన్‌ ప్రారంభించినపుడు, అక్కడ సంపాదకు వర్గంలో పనిచేశారు. తర్వాత రేడియోలో ట్రాన్స్‌మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికయ్యారు. హైదరాబాద్‌కు తన మకాం మార్చారు. ఆకాశవాణి విజయవాడలో కూడ పనిచేశారు. కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొఇంది, సంబల్‌పూర్‌ వెళ్లారు. ఆ తర్వాత చెన్నై,కడప కేంద్రాల్లో కార్యక్రమ నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వహించారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్ర ఉప డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. మొత్తం 20 సంవత్సరాలు పనిచేసి,అసిస్టెంట్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ హోదాలో పదవీ విరమణచేశౄరు. తర్వాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు..

విద్యార్థి దశలోకూడ అనేక నాటకాల్లో నటించారు.. ఆయన రచన అనంతం, ఉత్తమ రేడియో నాటకంగా అవార్డు తెచ్చిపెట్టింది.. అప్పటి సమాచార, ప్రసార శాఖామంత్రిడాక్టర్‌ బివి శేశ్‌కర్‌ చేతులమీదుగా ఈ అవార్డును అందుకున్నారు.. మనస్తత్వాలు నాటకాన్ని ఆంధ్ర అసోసియేషన్‌, కొత్తఢిల్లీవారి కోసం ప్రదర్శించారు. ఆ అసోసియేషన్‌కు వివి గిరి అధ్యక్షుడు, చైనా ఆక్రమణపై తెలుగులో తొలి నాటకం రచించి, చిత్తూరు, మదనపల్లి , నగరి ప్రాంతాల్లో ప్రదర్శించగా, వచ్చిన సుమారు రూ.50వేలను ప్రధాన మంత్రి రక్షణ నిధికి విరాళంగా అందించారు.. అంతేకాదు చైనా విప్లవంపై తెలుగులో వచ్చిన తొలి నాటకం ‘వందేమాతరంను ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించింది. అప్పటి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పివి నరసింహారావు దానికి ఉపోద్ఘాతం రాశారు. 1959, డిసెంబర్‌ 16న రాగరాగిణి అనే నాటకం అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఎదుట ప్రదర్శించబడింది.. పథర్‌కే అన్సూ అనే పేరుతో హిందీలో కూడ అనువదింప బడింది.

రచనలపై పరిశోధన:

ఆయన రచనలను భారతదేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా వాడుతున్నారు. తెలుగు నాటక రంగంపై ఆయన రాసిన వ్యాసాల పరంపరను ఆంధ్ర విశ్వవిద్లాయంలోని థియేటర్‌ ఆర్ట్స్‌ విభాగంలో పాఠ్యపుస్తకంగా నిర్ణయించారు. ఆయన రాసిన కళ్లు నాటక ఉస్మానియా విశ్వవిద్యాలయం మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ విద్యార్థులు పాఠ్యపుస్తకం.. ఆయన రచనలపై పరిశోధన చేసి, ఎంఫీల్‌, మరియు డాక్టరేట్లు సాధించినవారు కూడ ఉఆన్నరు చాలా సెఇమనార్లలో మారుతీరావు కీలకోపన్యాసకునిగా వ్యవహరించారు. తెలుగు సాహిత్యం మీద ఆయన రాసిన రెండు పరిశోధన పత్రాలు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం 11వ సంపుటిలో ప్రచురితమయ్యాయి.

కుటుంబం:

Gollapudi–

గొల్లపూడి వివాహం 1961, నవంబర 11న ,విద్యావంతులు సంగీతజ్ఞుల కుటుంబంలో పుట్టిన శివకామసుందరితో హన్మకొండలో జరిగింది. సి.నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు వంటి ప్రముఖులకు ఆమె తండ్రి ఉపాధ్యాయుడు.. ప్రముఖ రచయిత, విమర్శకుడు డాక్టర్‌ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి , మనోధర్మ సంగీతం బాణీ ప్రముఖుడు పద్మభూషణ్‌ శ్రీపాద పినాకపాణి ఆమెకు సమీప బంధువులు., మారుతీరావుకు ముగ్గురు మగ సంతానం, సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్‌. ప్రస్తుతం మారుతీరావు కుటుంబంతో నిన్నటి దాకా మద్రాసులో ఉన్నారు.

‘గొల్లపూడి శ్రీనివాస్‌ స్మారక పురస్కారం:

మారుతీరావు చిన్నకుమారుడు గొల్లపూడి శ్రీనివాస్‌ తన తొలి ప్రయత్నంగా ప్రేమపుస్తకం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ చిత్రీకరణ సమయంలో 1992 ఆగస్టు 12న జలప్రమాదంలో ప్రమాదవశాత్తూ మరణించారు..దీంతో గొల్లపూడి తన గొల్లపూడి శ్రీనివాస్‌జ్ఞాపకంగా గొల్లపూడి శ్రీనివాస్‌ జాతీయ అవార్డు నెలకొల్పి , ప్రతి ఏటా ఉత్తమ నూతన సినిమా దర్శకునికి రూ.1.50లక్షలు నగదు బహుమతి, ప్రముఖ చిత్రకారుడు దర్శకుడు బాపు రూపొందించిన బంగారపు జ్ఞాపికను ప్రదానం చేస్తున్నారు.. సినిమాకు సంబంధించిన ఏదేవి అంశంపై విశేష ఉపన్యాయం చేసిన ప్రముఖునికి గౌరవసూచకంగా రూ.15 వేలు గొల్లపూడి శ్రీనివాస్‌ మెమోరియల్‌ లెక్చర్‌ పేరిట బహూకరిస్తున్నారు. సునీల్‌దత్‌, నసీరుద్దీన్‌షా, మృణాల్‌సేన్‌, శ్యాంబెనగల్‌, జావెద్‌ అక్తర్‌, అనుపమ్‌ ఖేర్‌ మొదలైనవారు ఇందులో ప్రసంగించిన వారిలో ప్రముఖులు.. మిగిలిన ఇద్దరు కుమారులు సుబ్బారావు, రామకృష్ణలు మారుతీ ఎయిర్‌లింక్స్‌ అనే ట్రావెల్‌ ఏజన్సీని నడుపుతున్నారు.

సినీప్రస్థానం:

1963లో డాక్టర్‌ చక్రవర్తి చిత్రానికి మారుతీరావు స్క్రిప్టు రాశారు. మారుతీరావుకు అది తొలి సినిమా.. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథారచనకుగాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నంది అవార్డు లభించింది.. ఆయన నటుడిగా ప్రధానపాత్ర పోషించిన తొలిచిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఘన విజయం సాధించిన తర్వాత వెనుదిరిగి చూడాల్సిన అవసరం కలుగలేదు. 250 చిత్రాలకు పైనే సహాయక నటుడిగా, నటుడుగా, హాస్యనటుడిగా వివిధ పఆరతల్లో నటించారు. సంసారం ఒక చదరంగం, తరంగిణి, త్రిశూలం, అసెంబ్లీ రౌడీ, ముద్దుల ప్రియుడు, ఆదిత్య 369 ఆయన నటించిన కొన్ని సినిమాలు..
అవార్డులు:
మారుతీరావు ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక బిరుదులు, సన్మానాలు వరించాయి.. ఉత్తమ కథా రచయితగా , స్క్రిన్‌ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా అయిదు సందర్భాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి నంది అవార్డులను అందుకున్నారు.. అంతేకాకుండా నాటకాల్లో ఆయనకు పలు పురస్కారాలు లభించాయి.

పదవులు:

ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ నిర్వహించిన అనేక పోటీల్లో జ్యూరీ సభ్యుల్లో ఒకరిగా వ్యవహరంచారు.జాతీయ చలనచిత్ర అభివృద్ధి మండలి స్క్రిప్టు పరిశీలన విభాగంలో పనిచేశారు.. 1958లో జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రారంభించిన అంతర విశ్వవిద్యాలయ యువజనోత్సవాల్లో ఆంధ్రవిశ్వవిద్యాలయం తరపున మనస్తత్వాలు అనే నాటకాన్ని ప్రదర్శించారు. 1978లో మద్రాసులో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఆకాశవాణి తరపున సమీక్షకుడిగా వ్యవహరించారు..

1996లో జరిగిన ఇండియన్‌ పనోరమాలో జ్యూరీ సభ్యునిగా వ్యవహరించారు..2000 డిసెంబర్‌ 8న జరిగిన ప్రపంచ తెలుగు సమావేశంలో కళలు, సంస్కృతిపై సెమినార్‌కు అధ్యక్షత వహించారు.. 2007 జూన్‌ 2,3 తేదీల్లో చెన్నైలో జరిగిన అఖిలభారత తెలుగు సమావేశంలో కవి సమ్మేళనానికి అధ్యక్షత వహించారు. 2007 సెప్టెంబర్‌ 23న కృష్ణాజిల్లాలో జరిగిన తెలుగు రచయితల సమావేశంలో కీలకోపన్యాసకుడుగా వ్యవహరించారు..

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/