చిరుకు జోడీగా?

Actrress Trisha

చిరు నెక్స్ట్ ఫిలిం #చిరు152 గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి.  ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నారు. ఈమధ్యే ఈ సినిమాను లాంచ్ చేశారు.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది.  ఈ సినిమాలో చిరుకు జోడీగా హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిరు సరసన హీరోయిన్ గా త్రిషను తీసుకుంటే బాగుంటుందని కొరటాల భావిస్తున్నారట.  ఇప్పటికే త్రిషతో చర్చలు కూడా జరుపుతున్నారని దాదాపుగా త్రిషనే ఫైనలైజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా నయన్.. తమన్నాల పేర్లు కూడా వినిపించాయి రెండు మూడు కారణాల వల్ల వారిని వద్దనుకుంటున్నారట. 
 అయితే త్రిష లాంటి సీనియర్ ను తీసుకుంటే చిరుకు జోడీ బాగుంటుందని.. చాలా కాలం తర్వాత త్రిష తెలుగులో నటించడం కాబట్టి ప్రేక్షకులకు కూడా కొత్తదనం ఉంటుందని అలోచిస్తున్నారట.  త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/