ఈ అవార్డు నాకు గొప్ప అచీవ్‌ మెంట్‌

Mohanlal, President Ramnath Kovind
Mohanlal, President Ramnath Kovind

న్యూఢిల్లీ:ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌ లాల్‌కు ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా పద్మ భూషణ్‌ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కేంద్రప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పద్మభూషన్‌ అవార్డు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని మోహన్ లాల్ అన్నారు.నాకు వ్యక్తిగతంగా, ఓ నటుడిగా ఇది గొప్ప అచీవ్ మెంట్. నేను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 41వ వసంతాలు పూర్తవుతున్నాయి. నా కోస్టార్లు, కుటుంబసభ్యులు, నా అందమైన సినీ ప్రయాణంలో నా వెంట ఉండి సహకారం అందించిన ప్రతీ ఒక్కరూ నా విజయంలో భాగస్వాములేనని మోహన్ లాల్ అన్నారు.


మరిన్ని తాజా సినీమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/