సినిమా.. ఆగదు

-నిర్మాత ఎస్‌కెఎన్‌

Producer SKN
Producer SKN

టాక్సీవాలా చిత్రంతో నిర్మాతగా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుని, ప్రతిరోజు పండగ వంటి మరో బ్లాక్‌బస్టర్‌కు సహనిర్మాతగా వ్యవహరించారు ఎస్‌కెఎన్‌..జూలై 7న తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు..

విజయ్ దేవరకొండతో తాను నిర్మించిన టాక్సీవాలా హిట్‌ అందుకోవటమే కాకుండా టివిలో టెలికాస్ట్‌ అయిన ప్రతిసారి రేటింగ్స్‌ అందుకోవటం చాలా ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.. ప్రతిరోజు పండగ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించటం ఆనందంగా ఉందన్నారు..

ఇదే ఉత్సాహంతో ప్రస్తుతం మారుతీగారు దర్శకత్వంలో ఓ స్టార్‌హీరోతో తెరకెక్కబోతున్న సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించబోతున్నట్టుగా తెలిపారు..

అలాగే ప్రముఖ ఓటిటికి మారుతీగారు పర్యవేక్షణలో చేయబోతున్న వెబ్‌సిరీస్‌కు నిర్మాతగా ఉండబోతున్నట్టు తెలిపారు.

సాయి రాజేష్‌ దర్శకత్వంలో కూడ ఓ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నానని , అల్లు శిరీష్‌ తదుపరి సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా ఉండబోతున్నాననిఅన్నారు..

ఈ కరోనా క్రైసిస్‌ ముగిసిన వెంటనే తాను పనిచేస్తున్న ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రాబోతున్నాయని అన్నారు..

ఇండస్ట్రీపై ఓటిటి ప్రభావం ఎక్కువైందనే వాదనకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు.. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా సినిమా ఇండస్ట్రీకి ఏం కాదు అని అన్నారు.

ప్రేక్షకులు థియేటర్లలకు వెళ్లటం మానరు అని అన్నారు.. ప్రస్తుతం థియేటర్లు మూసి ఉండటం వలన, అల్‌రెడీ రిలీజ్‌ కావాల్సిన సినిమాలను జనాలకు చేరవేసి మాధ్యమంగా ఒటిటి లు నిర్మాతలకు కాస్త ఊరట నివ్వటం వాస్తవమేననిఅన్నారు..

కానీ ఈ కారణంగా థియేటర్‌ వ్యూయర్షిప్‌ తగ్గిపోతుంది అనే వాదనతో తాను ఏకీభవించను అని అన్నారు..

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/