మొదటి కార్వా చౌత్

Hot couple The first Karwa Chauth

స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తనకంటే చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను 2018 డిసెంబర్ లో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఉత్తరాది హిందువులు కార్వా చౌత్ అనే పండుగను చాలా వైభవంగా జరుపుకుంటున్నారు. భార్యలు ఒక జల్లెడ నుండి లేదా రంద్రాలు ఉన్న ఏదైనా వస్తువు నుండి భర్తల మొహాలు చూడాల్సి ఉంటుంది. చంద్రుడిని చూసిన తర్వాత భర్త మొహంను జల్లెడ ద్వారా చూసి భర్త చేతితో తీర్ధం తీసుకోవడం సాంప్రదాయంగా వస్తుంది.
ప్రియాంక చోప్రా మరియు నిక్ లకు పెళ్లి అయిన తర్వాత వచ్చిన మొదటి కార్వా చౌత్ అవ్వడం వల్ల కుటుంబ సభ్యులు అంతా ఈ వేడుకను చాలా వైభవంగా నిర్వహించారు. ఇందుకోసం ప్రియాంక చోప్రా మరియు నిక్ లు సాంప్రదాయ బద్దమైన డ్రస్ లు ధరించడంతో పాటు ఇద్దరు కూడా చాలా అందంగా తయారయ్యారు. ఇద్దరి జోడీకి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఈ ఫొటోలను నిక్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.
నా భార్య ఇండియన్.. ఆమె ఒక హిందువు. ఆమె ప్రతి సాంప్రదాయాన్ని చక్కగా పాటిస్తుంది. హిందూ సాంప్రదాయాలు అనేకం నాకు ఆమె నేర్పించింది. నేను ఆమెను చాలా ప్రేమిస్తున్నాను.. అలాగే ఆమె సాంప్రదాయాలను కూడా గౌరవిస్తానంటూ కార్వా చౌత్ శుభాకాంక్షలు తెలియజేశాడు. 

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/