ఆ రోజు చిత్ర షూటింగ్‌లకు సెలవు ప్రకటించాలి

Vishal
Vishal

చెన్నై: జూన్‌ 23వ తేదీన జరుగనున్న దక్షిణ భారత చలనచిత్ర నటీనటులు (నడిగర్‌) సంఘం ఎన్నికల సందర్భంగా షూటింగ్‌లన్నింటికి సెలవు ప్రకటించి ఎన్నికల నిర్వహణకు సహకారం అందించాలని సంఘ ప్రధాన కార్యదర్శ, నటుడు విశాల్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దక్షిణ భారత నటీనటుల సంఘం 2019-22 సంవత్సరానికి కొత్త నిర్వాహకులను ఎంపిక చేసేందుకు జూన్‌ 23వ తేది ఆదివారం చెన్నై రాజాఅన్నా మలైపురం సత్యా స్టూడియోలో ఎన్నికలు జరుగనున్నాయి. ఆ రోజు నడిగర్‌ సంఘం సభ్యులంతా నేరుగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే, దక్షిణ భారత చలనచిత్ర కార్మిక సమ్మేళనంలోని సభ్యులు పలువురు నడిగర్‌ సంఘంలోను సభ్యులుగా వున్నారు. ఈ మేరకు వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోని చిత్ర షూటింగ్‌లకు సెలవు ప్రకటించి నడిగర్‌ సంఘం ఎన్నికలు సక్రమంగా జరిగే విధంగా సహకరిం చాల్సిందిగా విశాల్‌ ఆ ప్రకటనలో కోరారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/