‘సైరా’ టీజర్ విడుదల

Sye Raa-film
Sye Raa-film

హైదరాబాద్‌: స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి నటించిన అత్యంత ప్రతిష్టాత్మక మూవీ ‘సైరా’. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు సైరా టీం మంచి ట్రీట్ ఇచ్చింది. ఈ నెల 22న మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితం సైరా సినిమా టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. చరిత్ర స్మరించుకుంటుంది..ఝాన్సీ లక్ష్మీబాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల్ని. కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడుగ అంటూ వవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వాయిస్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం ఆసక్తి రేపింది. ఇందులో చిరంజీవి చేసే యుద్ద సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో నయనతార, తమన్నా, జగపతిబాబు, అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబరు 2న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/