అమేజింగ్ టాలెంట్

‘దిల్ బెచారా’ టైటిల్ ట్రాక్ విడుదల

Sushant Singh Rajput's still from Dil Bechara
Sushant Singh Rajput’s still from Dil Bechara

బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఆఖరు చిత్రం “దిల్ బెచారా” ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ ను రూల్ చేస్తుండగా మరికొన్ని రోజుల్లో డైరెక్ట్ ఓటిటిలో విడుదల కానుంది.

అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎంత అమేజింగ్ టాలెంట్ కలిగిన నటుడో తన ఆఖరి చిత్రం ద్వారా మొత్తం ఫిల్మ్ లవర్స్ కి తెలిసింది.

ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి “దిల్ బెచారా” టైటిల్ ట్రాక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసారు.

దాదాపు 2 నిమిషాల 44 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో సాంగ్ లో సుశాంత్ అద్భుతమైన పెర్ఫామెన్స్ కనబరిచాడు.

ఏకంగా 2 నిమిషాల 30 సెకండ్ల డాన్స్ పెర్ఫామెన్స్ ను కేవలం ఒకే ఒక్క టేక్ చేసి ఆశ్చర్య పరిచాడు.

ఎక్కడా కూడా ఫ్రేమ్ మిస్సింగ్ కానీ కట్స్ కానీ ఈ వీడియోలో లేవు.

జస్ట్ కెమెరా యాంగిల్ మారుస్తూనే ఈ సాంగ్ ను షూట్ చేయగా సుశాంత్ అద్భుతంగా రక్తి కట్టించాడు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/