‘వడ్డీలోడు వచ్చెనే.. గడ్డికోసం చూసెనే…

Surya in NGK
Surya in NGK

గజిని ,సింగం వంటి చిత్రాలతో ప్రేక్షకులతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సూర్య.. తాజాగా ఎన్‌జికె సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. శుక్రవారం ఈచిత్రంలోని తొలిపాటను విడుదలచేశౄరు.వడ్డీలోడు వచ్చెనే.. గడ్డికోసం చూసెనే.. అడ్డమైన మాటలు.. అడ్డేలేక వాగెనే.. అంటూ చంద్రబోస్‌ రాసిన పాటను సత్యన్‌ అద్భుతంగా పాడారు. ఈ పాటకు యువన్‌శంకర్‌ రాజా సంగీతం అందించారు.. సూర్యకు జంటగా సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటిస్తున్న ఈచిత్రం షూటింగ్‌ పూర్తిచేసుకుని శరవేగంగా పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది.. శ్రీరాఘవ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు , డ్రీమ్‌వారియర్స పిక్చర్స్‌ , రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిర్మిస్తున్నారు.