గుబులు రేపుతున్న చీరకట్టు!

Suhana khan in Saree
Suhana khan in Saree

కింగ్ ఖాన్ షారూక్ నటవారసురాలు సుహానాపైనే అందరి కళ్లు. ఈ అమ్మడు ఖాన్ దాదా వారసురాలిగా ఏం చేయబోతోందో? అంటూ వెయ్యి కళ్లతో అభిమానులు వేచి చూస్తున్నారు.
ఇక సుహానా ఇప్పటికే విదేశాల్లో చదువులు పూర్తి చేసుకుని నటశిక్షణ తీసుకునేందుకు రెడీ అవుతోంది. అందుకు లండన్ (బ్రిటన్) వెళ్లనుంది. గత ఏడాది సడెన్ గా సుహానా వోగ్ ఫోటోషూట్ తో పీక్స్ లో విరుచుకుపడడం తెలిసిందే. కింగ్ ఖాన్ చాలా క్లారిటీగా సుహానా కథానాయిక అవుతుందని ప్రకటించి సర్ ప్రైజ్ ఇచ్చారు. అప్పటి నుంచి సుహానా ఏ ఈవెంట్ కి వెళ్లినా మీడియా కెమెరాలు తననే వెంటాడుతున్నాయి. సుహానా ఏ ఫోజిచ్చినా వెంటనే కాప్చుర్ చేసేస్తూ జనాల ముందుకు తెచ్చేస్తున్నాయి. ఇక సుహానా సైతం ఎప్పటికప్పుడు తన సెల్ఫీలు.. ఫోటోలు.. వీడియోలు ప్రతిదీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ సోషల్ మీడియాలో అసాధారణ ఫాలోయింగ్ తెచ్చుకుంది.
తాజాగా మరోసారి సుహానా వార్తల్లోకి వచ్చింది. సుహానా ఈసారి అల్ట్రా మోడ్రన్ చీరకట్టులో గుబులు రేపుతోంది. పక్కాగా న్యూ స్టైల్ లో చీరకట్టి మతి చెడగొట్టింది. అసలే పెళ్లికి వెళ్లింది. అక్కడ స్నేహితురాళ్లతో ఓ రేంజులో చెలరేగింది. పూర్తిగా సాంప్రదాయబద్ధంగా కనిపిస్తున్నా అందరి కళ్లు సుహానా స్టైల్ పైనే. సుహానా తన డార్క్ రంగులో కలిసిపోయే ఆలివ్ గ్రీన్ డిజైనర్ చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ బాటమ్ లో డార్క్ గ్రీన్ సల్వార్ ని ధరించింది. ఇక ఈ ఫోటోల్ని సుహానా క్లోజ్ ఫ్రెండ్ ఆలియా చిబ్బా సోషల్ మీడయాలో షేర్ చేసింది.