శ్రీనివాస్ తమ్ముడు గణేష్ ఎంట్రీకి రంగం సిద్ధం

Bellamkonda srinivas with brother ganesh

బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ ఇప్పటికే హీరోగా పలు సినిమాలు చేశాడు.  రీసెంట్ గా ‘రాక్షసుడు’ సినిమాతో తొలి హిట్ కూడా అందుకున్నాడు. ఇప్పుడేమో శ్రీనివాస్  తమ్ముడు గణేష్ ఎంట్రీకి రంగం సిద్ధం అయింది. బెల్లంకొండ గణేష్ హీరోగా తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  ఈ కొత్త హీరో సినిమా లాంచ్ డేట్ తాజాగా ఫిక్స్ అయింది.
గణేష్ డెబ్యూ సినిమాకు అక్టోబర్ 5 న అన్నపూర్ణ స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలు జరిపి లాంచ్ చేస్తారు.  ఈ సినిమాకు పవన్ సాదినేని దర్శకుడు. పవన్ గతంలో ‘ప్రేమ ఇష్క్ కాదల్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.  ఈ సినిమాకు రాధన్ సంగీతం అందిస్తాడని.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫే అందిస్తాడని సమాచారం. టాలీవుడ్ లో కొత్త హీరోను పరిచయం చేస్తున్నారంటే దాదాపుగా ఆ సినిమా కథ లవ్ స్టొరీనే అయి ఉంటుంది.  గణేష్ డెబ్యూ సినిమా కూడా అందుకు భిన్నమేమీ కాదు.  ఈ సినిమా కూడా ఒక లవ్ స్టొరీనే. ఈ సినిమాలో గణేష్ కు జోడీగా నటించే హీరోయిన్.. ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.  

తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/