పటాస్‌ షో నుండి బ్రేక్‌ తీసుకున్న శ్రీముఖి

Sreemukhi
Sreemukhi

హైదరాబాద్‌: ప్రముఖ టీవీ యాంకర్‌ శ్రీముఖి సినిమాలో చిన్నచిన్న పాత్రలో నటించిన పెద్దగా క్రేజ్‌ రాలేదు. కానీ ప‌టాస్ అనే కార్య‌క్ర‌మంతో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయింది. రాముల‌మ్మ‌గా శ్రీముఖి ఫుల్ ఫేమస్. ప‌టాస్ షోలో శ్రీముఖి త‌న మాట‌ల‌తోనే కాదు గ్లామ‌ర్‌తోను అల‌రించింది. స్టూడెంట్స్‌తో ఈ అమ్మ‌డు చేసే ఫ‌న్ ఆడియ‌న్స్‌ని రంజింపజేసింది. ప‌టాస్ కార్య‌క్ర‌మం ఫుల్ హిట్ కావ‌డంతో ఈ మ‌ధ్య శ్రీముఖి, ర‌వి హోస్ట్‌గా ప‌టాస్ 2 కూడా మొద‌లు పెట్టారు. అయితే ప‌టాస్ షోకి కొద్ది రోజులు తాను బ్రేక్ ఇవ్వ‌బోతున్న‌ట్టు వీడియో ద్వారా తెలిపింది శ్రీముఖి. నిర్వాహకుల అనుమతితోనే తాను బ్రేక్ తీసుకుంటున్నన్నట్టు పేర్కొంది. త‌న‌ని ఇంత‌గా ఆద‌రించిన బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి కూడా ఈ విష‌యం తెలియాల‌నే ఈ వీడియో చేస్తున్న‌ట్టు తెలిపింది శ్రీముఖి. ప‌టాస్ షో త‌న హృద‌యానికి చాలా ద‌గ్గ‌రైంద‌ని చెబుతూ, నిర్మాణ సంస్థ మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది.


మరిన్ని తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/