అమోఘమైన భావోద్వేగాలు: శ్రద్ధా శ్రీనాధ్‌

Sradha Srinath Interview
SRADHA SRINATH


అందంలో అభినయంలో తనకంటూ ఓప్రత్యేక శైలితో దూసుకొస్తున ప్రతిభావంతురాలైన కన్నడ నటి శ్రద్ధ శ్రీనాధ్‌.. జెర్సీ సినిమాతో నాని సరసన నటిస్తూ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది.. ఇపుడు తాజాగా నాచురల్‌స్టార్‌ నాని హీరోగా మళ్లీ రావా ఫేం గౌతమ్‌ తిన్నసూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న జెర్సీ సినిమాతో ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడింది.. జెర్సీ సినిమాక సంబంధించి తన వర్టక పట్ల శ్రద్ధ చాలా సంతోషంగా ఉన్నట్టు తెలిపింది.. ఈ సినిమాలో తనకు అమోఘమైన భావోద్వేగాలను పండించగల సన్నివేశాల్లో నటించే అవకాశం రావటం చాలా ఆనందం కల్గించిందన్నారు.. అలాగే సినిమాలో టీనేజర్‌గా , ఒక మదర్‌గా ఇలా వేర్వేరు దశల్లో కన్పిస్తానని తెలిపింది.. నాని పక్కన నటించటం గురించి చెబుతూ, నాని సహజ నటుడని, ఎలాంటి సన్నివేశాన్ని అయినా ఆయన చాలాసింపుల్‌గా చక్కని హావభావాలతో నటిస్తారని తెలిపింది.. అయన పక్కన నటించటం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, అదేవిధంగా ఈసినిమా ఒప్పుకోవటానికి నానితోపాటుగా దర్శకుడు గౌతమ్‌ , నిర్మాత సూర్యదేవర అనిరుధ్‌తో మొత్తం చిత్ర బృందం కూడ కారణమని పేర్కొంది..ఇదిలాఉండగా, కొన్ని సంవత్సరాలపాటు హైదరాబాద్‌లోనే పెరిగిన శ్రద్ధ.. ఇప్పటికే పలు కన్నడ , తమిళ్‌ సినిమాల్లో కూడ నటించింది.