సినీ పరిశ్రమ టెక్నీషియన్‌ ఏక్‌నాథ్‌ కన్నుమూత

Eknath
Eknath

హైదరాబాద్‌: ప్రముఖ టెక్నీషియన్‌ ఏక్‌నాథ్‌(70) కన్నుమూశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఏక్‌నాథ్‌ 55 ఏళ్ల క్రితమే సినీ పరిశ్రమలో పనిచేసేందుకు మద్రాసు వెళ్లిపోయారు. సినీ పరిశ్రమలో స్పెషల్ ఎఫెక్ట్స్ కింగ్‌ అనే పేరు పేరుగాంచిన వ్యక్తి ఏక్‌నాథ్‌ కంప్యూటర్‌ వాడకం లేని రోజుల్లోనే స్పెషల్‌ ఎఫెక్ట్‌ల సృష్టికర్తగా ఆయనకు పేరుంది. ప్రముఖ కెమెరామెన్‌ మోహనకృష్ణకు ఏక్‌నాథ్‌ సోదరుడు. ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యలకు గురిచేసిన విఠలాచార్య సినిమాలకు అప్పట్లోనే అద్భుత టెక్నాలజీని వాడారు. గ్రాఫిక్స్ లేని రోజుల్లో చారిత్రక, పౌరాణిక, జానపద చిత్రాల్లో సన్నివేశాలను రక్తికట్టించిన ఏక్‌నాథ్‌.. అనేక త్రీడి చిత్రాలకు స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. మొత్తం తన కెరీర్‌లో 700 చిత్రాలకు స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ సమకూర్చారు. అమితాబ్‌, ఎన్టీఆర్, రజనీ, కమల్‌ సహా దేశంలో అగ్రహీరోల చిత్రాలకు ఆయన పనిచేశారు.


మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/