ఎవరూ బాధపడొద్దు..

చివరిగా బాలు వీడియో సందేశం

SP BALU -finally Video msg
SP BALU -finally Video msg

ఎస్పీబాలు మరణానికి ముందు తన చివరి వీడియోను రూపొందించారు. ఆ వీడియో చూసిన ఎవరికైనా ఏడుపు ఆగదు..

అంతగా ఆయన మాటలు కలచివేస్తాయి.. ఇంతకీ ఏమన్నారంటే.. కోవిడ్‌ మైల్డ్‌గా ఉంటే ఇంటోనే ఉండి చికిత్సపొందాలను ..సీరియస్‌ అయితేనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు..

అలాగే తన ఆరోగ్యం మెరుగువుతోందని మరో రెండు రోజుల్లో బయటకు వస్తానని కూడ ఆయన అనటం చూస్తుంటే ఆయన హోప్‌.. సంకల్ప బలం ఎంత ఉందో తెలుస్తోంది..

2,3 రోజులుగా అంత సౌకర్యంగా లేను. నా ఛాతీ కండిషన్‌ అంతగా బాలేదు.. జలుబు, దగ్గు , జ్వరం ఉన్నాయి.. నాకు మైల్డ్‌ కండీషన్‌ అయినా కానీ ఇంట్లోనే ఉండకుండా ఆసుపత్రిలో చేరాను..

మందులు తీసుకుంటున్నా. ఆసుపత్రి వైద్యులు, స్నేహితులు బాగా చూసుకున్నారు. నా ఆరోగ్యం బానే ఉంది.. ఎవరూ బాధపడొద్దు..

నేను ఇక్కడకి రావటంపై బాధపడొదు..నాకు కాల్‌చేసే ప్రయత్నం చేయొద్దు… జ్వరం తప్ప అంతా బాగానే ఉన్నాను.. అని బాలు అన్నారు.

డిస్ట్రబ్‌ చేయొద్దు. అని వీడియోలో కోరారు.. కానీ ఇంతలోనే బాలు మరణం అందరికీ షాకిచ్చింది..

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/