ఇండియన్ ఎయిర్ పోర్ట్ పనితీరు భేష్

అధికారులకు సోనమ్‌ ప్రశంస

Actress Sonam Kapoor

సామాజిక అంశాలపై అవసరమైనపుడల్లా స్పందించే సోనమ్‌కపూర్‌ ఇపుడు కరోనా ప్రభావం నేపథ్యంలో మరోసారి ముందుకొచ్చారు..

కరోరా వైరస్‌ వ్యాప్తిని అరికట్టటానికి భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఎంతో గొప్పగా ఉన్నాయని బాలీవుడ్‌ నటీమణి సోనమ్‌కపూర్‌ ప్రశంసలుకురిపించారు.

భారత ఎయిర్‌పోర్ట్‌ అధికారులు కరోనాను అరికట్టేందుకు నిబద్ధతతో పనిచేస్తున్నారని, అందుకు వారికి ధన్యవాదాలు అని పేర్కొన్నారామె..

సోనమ్‌ తన భర్త ఆనంద్‌ ఆహుజాతో కలిసి లండన్‌ నుంచి ఢిల్లీకి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విదేశీ ప్రయాణాలు ముగించుకుని స్వదేశంలో అడుగుపెట్టిన సోనమ్‌ దంపతులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు స్క్రీనింగ్‌ నిర్వహించటంతోపాటు గత 25 రోజులుగా వారు చేస్తున్న ప్రయాణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈనేపథ్యంలో తన అనుభవాలను సోనమ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ‘మేం లండన్‌ నుంచి బయలుదేరుతున్నపుడు స్క్రీనింగ్‌ చేయలేదు..

ఈ విషయం తెలిసి షాకయ్యాం.. అయితే భారత్‌ చేరుకోగానే మా ప్రయాణాలకు సంబంధించిన వివరాలను ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఫారమ్‌లో నింపమన్నారు.

అయితే అంతటితో ఆగిపోకుండా మరోసారి మా పాస్‌పోస్టులు పరిశీలించి మేం చెప్పింది నిజమా కాదా అని చెక్‌ చేశారు.

అక్కడ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. ఇది అభినందించదగ్గ విషయం భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం..అంటూ పేర్కొన్నారు.

తాజా ‘నాడి వ్యాసాల కోసం https://www.vaartha.com/specials/health1/