సెన్సార్ షాక్.. బోల్డ్ సీన్ కట్

de de pyar de rakul preet singh photo
de de pyar de rakul preet singh photo

రకుల్ ప్రీత్ సింగ్ నటించిన తాజా బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అజయ్ దేవగణ్ ఈ సినిమాలో హీరో.  సీనియర్ హీరోయిన్ టబు మరో కీలకపాత్రలో నటిస్తోంది.  సినిమా కథ విషయానికి వస్తే అశిష్ అనే 50 ఏళ్ల అజయ్  తన భార్య టబు నుంచి విడిపోయి సింగిల్ గా ఉంటాడు. ఈ సమయంలో అందమైన అయేషా (రకుల్ ప్రీత్)తో ప్రేమలో పడతాడు. ఈ సినిమాలో రకుల్ పాత్రను కాస్త బోల్డ్ గా డిజైన్ చేశారట.  దీంతో సెన్సార్ నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయట.
బోల్డ్ పాత్ర కావడం తో రకుల్ విపరీతంగా గ్లామర్ ఒలకబోసింది.  అంతే కాదు వడ్డీ షరాబన్ పాటలో మద్యం బాటిల్ చేత బట్టుకొని మధ్యమధ్యలో ఒక సిప్ వేస్తూ చిందులు వేయడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. యూట్యూబ్ లో రిలీజ్ అయిన వీడియో సాంగ్ లో ఇదంతా ఉంది. అయితే సెన్సార్ వారు మాత్రం ఈ సీన్ ను మార్చాల్సిందే అంటున్నారట. మద్యం సీసాకు బదులుగా ఒక పూల బొకే పెట్టాలని నిర్మాతలకు సూచించారట
ఇలాంటి సీన్లే కాకుండా ద్వంద్వార్థాలు వచ్చే డైలాగులు కూడా చాలానే ఉన్నాయట.  ఒక సీన్లో “ఫెర్ఫార్మెన్స్ బెటర్ హోతీ హై” మరో సీన్లో “మంజు జీ కే ఆలూ ఓ ఓ.. వహీ అచ్చే హై” అనే డైలాగులను తొలగించిందని సమాచారం.  దీంతో దే దే ప్యార్ దే యూనిట్ కాస్త నిరాశకు గురయిందట.  అకివ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. జావేద్ జాఫ్రీ.. జిమ్మీ షెర్గిల్.. అలోక్ నాథ్ లు ఇతర కీలక పాత్రలలో నటించారు.