సినీ నటుడు రాళ్లపల్లి కన్నుమూత

Rallapalli
Rallapalli

హైదరాబాద్‌: ప్రముఖ సీనీ నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు (73) కన్నుమూశారు. ఆయనగత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో  బాధపడుతు శుక్రవారం సాయంత్రం మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.
 రాళ్లపల్లి 1960లో నటనా జీవితానికి శ్రీకారం చుట్టారు. అనంతరం 1974లో స్త్రీ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన రాళ్లపల్లి.. శుభలేఖ, ఖైదీ, ఆలయ శిఖరం, మంత్రిగారి వియ్యంకుడు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, ఆలాపన, న్యాయానికి సంకెళ్లు, ఏప్రిల్‌ 1 విడుదల, సూర్య ఐపీఎస్‌, దొంగపోలీసు, కన్నయ్య కిట్టయ్య, సుందరకాండ, భలే భలే మగాడివోయ్‌ తదితర 850కి పైగా చిత్రాల్లో నటించారు. 1945 ఆగస్టు 15న అనంతపురం జిల్లా కంబదూరులో జన్మించిన రాళ్లపల్లికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె మృతి చెందగా.. మరో అమ్మాయి అమెరికాలో ఉంటున్నారు. రాళ్లపల్లి భౌతికకాయాన్ని నిమ్స్‌లోని మార్చురీకి తరలించారు. అమెరికా నుంచి ఆయన కుమార్తె వచ్చేంత వరకు అక్కడే ఉంచనున్నారు.