సరిలేరు నీకెవ్వరు..అన్నట్లుగా ప్రీ రిలీజ్ ఏర్పాట్లు!

Sarileru neekevvaru onlocation set pic

సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్ తో అంచనాలు పెరిగాయి. ఆ హైప్ ను మరింత పెంచేలా ప్రీ రిలీజ్ వేడుక మరియు ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించాలని చిత్ర ప్రమోషనల్ టీం భావిస్తుంది. అందుకోసం భారీ ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.
ఇప్పుడు ఆ వేడుకను మించేలా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా వేడుక నిర్వహించాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
లక్షలాది మంది అభిమానుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించేందుకు ఇప్పటి నుండే ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సాహో ప్రీ రిలీజ్ వేడుక జరిగిన రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతంలోనే సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుక జరపనున్నట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున అభిమానులతో పాటు పలువురు టాలీవుడ్ స్టార్స్ ను కూడా ఈ వేడుకలో భాగస్వామ్యం చేయాలని సరిలేరు నీకెవ్వరు టీం భావిస్తున్నారు. 

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/