సంజీవని రిలీజ్‌

SANKEEVANI-
SANKEEVANI-

సంజీవని రిలీజ్‌

మనోజ్‌ చంద్ర, అనురాగ్‌ దేవ్‌, శ్వేత ప్రధాన పాత్రల్లో రవి వీడే దర్శకత్వంలో జి.నివాస్‌ నిర్మిస్తున్న చిత్రం సంజీవని.. ఈచిత్రం ఈనెల 29న విడుదల కాబోతోంది.. ఈసందర్భంగా మీడియాతో టీం మాట్లాడింది.
దర్శకుడు రవి వీడే మాట్లాడుతూ, తక్కువ బడ్జెట్‌లో సంజీవని వంటి సినిమా చేయటం అసాధ్యమని సినిమా చూసినవారు ఎవరైనా అంటారన్నారు. కానీ మేం ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశామన్నారు. దీనికి కారణం అందరూ ఓ టీంగా పనిచేయటమే అన్నారు. తెలుగు సినిమాను హాలీవుడ్‌ స్థాయిలో తీశామని, సొంతంగా గ్రాఫిక్‌ స్టూడియో నిర్మించుకోవటమే కాదు. కెనడా, హైదరాబాద్‌లోని కొన్ని విఎఫ్‌ఎక్స్‌ స్టూడియోల సహాయంతో సినిమాను పూర్తిచేశామన్నారు.. రెండు సంవత్సరాలు కష్టపడ్డామని, 1000కి పైగా విఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ ఉన్నాయన్నారు. అన్ని వర్గాలకు నచ్చే ఈసినిమా ఈనెల 29న విడుదల కాబోతోందన్నారు. అనురాగ్‌ దేవ్‌ మాట్లాడుతూ, రెండేళ్లపాటు యూనిట్‌ అంతా కష్టపడి చేసిన సినిమా అనానరు. షూటింగ్‌ కంటే విఎఫ్‌ఎక్స్‌కే ఎక్కువ సమయం పట్టిందన్నారు. మా ట్రైలర్‌ చూపి రాజమౌళి, రామ్‌గోపాల్‌వర్మ వంటి పెద్ద డైరెక్టర్లు ట్వీట్‌ చేశారంటే ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు అన్నారు. దీంతో సినిమాపై అంచనాలు వచ్చాయన్నారు.
మోహన్‌ భగత్‌ మాట్లాడుతూ, కొత్తవాళ్లమైన మాతో ఇలాంటి ఓ మంచి సినిమాను చేసిన రవిగారికి ధన్యవాదాలు అన్నారు. కార్యక్రమంలో పూర్ణేష్‌, దేవిశ్రీప్రసాద్‌, శ్వేతావర్మ, తనూజ, నితిన్‌నాశ్‌ తదితరులు మాట్లాడారు.