కొత్త కథ రెడీ

‘అర్జున్‌రెడ్డి’ కాంబోలో మరో మూవీ

Sandeep vanga
Sandeep vanga

‘అర్జున్‌రెడ్డి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ వంగ..

ఈ చిత్రాన్ని హిందీలో కబీర్‌సింగ్‌ పేరుతో రీమేక్‌ చేసి అక్కడ కూడ భారీ బ్లాక్‌బస్టర్‌ అందుకు ఏకంగా బాలీవుడ్‌లోనే స్టార్‌ డైరెక్టర్‌గా మంచి క్రేజ్‌ సంపాదించారు..

ప్రస్తుతం ఆయన మరో వైవిధ్యమైన చిత్రం కోసం రెడీ అవుతున్నారు.. మరో భారీ ప్రాజెక్టును ప్రకటించటానికి రెడీ అవుతున్న టైమ్‌లో లాక్‌డౌన్‌ తో వాయిదా పడింది.

ఈ సమయంలోనే రెండు కథల్ని సిద్ధంచేశారని తెలిసింది..

వాటిలో ఒకటి విజయ్ దేవరకొండ కోసమని తెలిసింది.. అయితే ఈసినిమా మరో రెండేళ్లు పడుతుందని తెలుస్తోంది.. మొత్తానికి అర్జున్‌రెడ్డి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందని టాక్‌..

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/