సమంత ‘ఓ బేబి ఫస్ట్‌లుక్‌

samantha
samantha

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించటమే కాదు.శతాధిక చిత్రాలను నిర్మించిన ఏకైన సంస్థసురేష్‌ ప్రొడక్షన్స్‌, భారతీయ అధికారిక భాషలన్నింటిలోనూ సినిమాలు నిర్మించిన వన్‌ అండ్‌ ఓన్లీ ప్రొడక్షన్‌ హౌస్‌ కూడ సురేష్‌ ప్రొడక్షన్స్‌.. ఎన్టీఆర్‌, ఎఎన్‌ఆర్‌ వంటి అగ్ర కథానాయకుల నుంచి నేటి కుర్ర స్టార్స్‌ వరకు సినిమాలను నిర్మించిన ఈసంస్థ ఈ ఏడాదితో 55 వసంతాలను పూర్తిచేసుకుంటుంది.. ఈసందర్భంగా సురేష్‌ ప్రొడక్షన్స్‌లో నిర్మిస్తున్న ఓ బేబి సినిమాఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
పెర్ఫామెన్స్‌ పాత్రలకు తన నటనతో ప్రాణంపోస్తూ సినిమా సక్సెస్‌లోకీలక భూమిక పోషిస్తున్న అగ్రకథానాయిక సమంత అక్కినేని, ఓబేబి చిత్రంలో సమంత ప్రధాన పాత్రధారిగా నటించారు.. ఆమెతోపాటు సీనియర్‌ నటి లక్ష్మికూడ ఉన్నారు.. ఈ చిత్రాన్ని బివి నందినీరెడ్డి డైరెక్టు చేశారు. చిత్రీకరణ పూర్తయింది.. పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి ఈచిత్రాన్ని జూలైలో విడుదల చేయనున్నారు. రావు రమేష్‌, రాజేంద్రప్రసాద్‌, ప్రగతి కీలకపాత్రల్లో నటించారు. మిక్కి జె.మేయర్‌ సంగీతం అందించారు

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/